30, డిసెంబర్ 2014, మంగళవారం

Happy New year

అనంత పయనం లో మరో ఏడాది గడిచిపోయింది. నవ్వుతూనే ఉన్నామో, నవ్వుతూ..ఏడుస్తూ ఉన్నామో...అసలు ఎప్పటికైనా నవ్వుతామా దేవుడా అనిపించేంతగా శోకాంబుధిలో మునిగిపోయామో...ఎవరికి వారికే తెలిసిన, ప్రత్యేకమైన జీవితగ్రంధమది. అయితే, జీవన గమనం లో మరో కొత్త ప్రస్థానం ప్రారంభించబోయే తరుణాన...ఒక్కసారి అందరం...పరస్పరం శుభకామనలు తెలియజేసుకోవడం మన కనీస విధి...మర్యాద. అందుకే..ఈ బ్లాగులోకి కన్నూనిన ప్రతి ఒక్కరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుదామని  మళ్లీ  మౌసు పెన్ను పట్టుకున్నాను. అందరికీ హేపీ న్యూ ఇయర్...!!! ఆఖరికి 31-12-2015 న ఈ బ్లాగు చూసిన వాళ్లు కూడా నేను మీకు పన్నెండు నెలల కిందటే న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పేశానని గ్రహించండి చాలు...ఓకే...ఆల్ ది బెస్ట్..!!